యుద్దం

ఆకాశం రోజూ తలుపులు తెరచుకొని
నన్ను నిద్ర లేపుతుంది.

చక్రాయుధంతో, ఖడ్గాయుధంతో
ఓ మహా యుద్దాన్ని జయించి
సింహాసనమధిరోహిస్తాను.

సాయంత్రానికి చంద్రకులస్తులు
నన్ను ఓడించి అరణ్యానికి తరిమేస్తున్నారు.
మరో యుద్దానికి సిద్దమవుతూ నేను నిద్రపోతున్నాను.

 

1 comments:

Bolloju Baba said...

ఆకాశం రోజూ తలుపులు తెరచుకొని
నన్ను నిద్ర లేపుతుంది.

మంచి ఎత్తుగడతో కవిత మొదలయ్యింది.
చివరికంటా ఆ టెంపో కొనసాగింది
అభినందనలు