త్యాగరాజే మనకు ఆదర్శం

ఇప్పటి వరకూ నాకు బ్లాగులో తెలుగు, ఇంగ్లీషు పదాల వాడుకలో కోటి కోటి అనుమానాలు ఉండేవి.

ఈ రోజు ఈమాటలో త్యాగరాజు గారి వ్యాసం చూశాక అవన్నీ పటా పంచలయ్యాయి.

---
తెలుగు లెస్స
అప్పట్లో తంజావూరు రాజ్యంలో చాలా భాషలు వాడుకలో ఉండేవి. తమిళ దేశం కావడం వల్ల తమిళం మాట్లాడేవారు. పండిత భాషగా, రాజ భాషగా తెలుగూ వ్యవహారికంగా నడిచేది. బ్రిటీషు వాళ్ళ ధర్మమాని ఇంగ్లీషు వచ్చి పడింది. ఇంకో పక్క ముస్లిం పాలకులు, హైదరాలీ, తదనంతరం టిప్పు సుల్తాన్ల ఆక్రమణలతో ఆ ప్రాంతంలో ఉర్దూ భాషా చెలామణీ అయ్యింది. ఇలా ఇన్ని భాషల మధ్యా, ఇన్ని వైవిధ్య భరితమైన మత సంస్కృతుల మధ్యా, త్యాగరాజు తెలుగు భాషలో చేసిన కృషి అజరామరం. ఎన్నో వందల కృతులు రచించాడు. అందులో కొన్ని సంస్కృతంలో ఉన్నాయి. కొన్ని సంస్కృతమూ, తెలుగూ కలిపున్నాయి. స్వతహాగా తమిళ భాషలో ప్రవేశమున్నా, ఒక్క కృతీ అందులో రచించలేదు. అంతే కాదు పరాయి భాషా పదాల్ని కూడా ఎక్కడా రానీయ లేదు. మొత్తం కృతులన్నీ పరిశీలిస్తే కేవలం రెండో, మూడో ఉర్దూ పదాలూ, ఒకే ఒక్క ఆంగ్ల పదం దొరికింది
----

 

0 comments: